AP CM YS Jagan, Bharathi 26th Wedding Anniversary.. Marriage pics Viral
mictv telugu

ఏపీ సీఎం పెళ్లిరోజు.. వైరలవుతున్న పెళ్లినాటి ఫొటోలు, శుభలేఖ

August 28, 2022

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నేడు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన జీవితంలో నేడు అతి ముఖ్యమైన రోజు. 1996లో స‌రిగ్గా ఇదే రోజు (ఆగష్టు 28) ఆయ‌న వైఎస్ భార‌తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. వెర‌సి నేడు జ‌గ‌న్‌, భార‌తిల 26వ వివాహ వార్షికోత్స‌వం. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని జ‌గ‌న్ దంప‌తుల‌కు వైసీపీ శ్రేణుల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లినాటి ఫొటోలు, వెడ్డింగ్ కార్డును అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులలోని వైఎస్‌ఆర్ఆర్ లయోలా డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఆగస్టు 28, 1996 ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్-భారతి వివాహం ఘనంగా జరిగింది. ఇదే ముహూర్తానికి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వివాహం కూడా జరగడం విశేషం.

జ‌గ‌న్ మ్యారేజ్ డేను గుర్తు చేసుకున్న ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆదివారం ఉద‌యం ఆ దంప‌తుల‌కు గ్రీటింగ్స్ చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ దంప‌తుల‌కు మ్యారేజ్ డే విషెస్ చెప్పారు. జ‌గ‌న్ దంప‌తుల‌కు ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని జ‌గ‌న్నాథ్‌, బాలాజీ దేవుళ్ల‌ను ప్రార్థిస్తున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ త‌న విషెస్‌లో తెలిపారు. ఇక సీఎం పెళ్లిరోజును పురస్కరించుకొని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు జగన్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో పాత ఫొటోలను వైరల్ చేస్తూ సీఎం దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.