ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే రాష్ట్రానికి పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇది అధికారిక పర్యటన అయితే త్వరలో జగన్ విదేశాలకు వెళ్లనున్నారు. ఈ సారి మాత్రం వ్యక్తిగత పర్యటన కానుంది. ఈ నెల చివర్లో వైఎస్ జగన్ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఆయన పెద్ద కూతురు హర్షిణి రెడ్డి పారిస్‌లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. జులై 2న అక్కడ కాన్వొకేషన్ కార్యక్రమం జరుగనుండడంతో కూతురు కోసం ముఖ్యమంత్రి ఆమేరకు హాజరుకానున్నారు.