AP CM YS Jagan tributes and emotional tweet on his father YS Rajasekhara Reddy death anniversary
mictv telugu

ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా.. సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్

September 2, 2022

దివంగత మహానేత , ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయి నేటితో 13 ఏళ్లు పూర్తవుతోంది. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, ఇతర వైఎస్ఆర్ కుటుంబసభ్యులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్‌ను తలుచుకుంటూ సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి.. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు… ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ అంటూ జగన్ పేర్కొన్నారు.