AP: Constable Rasalilalu outside..naked on the sidewalk
mictv telugu

ఏపీ: బయటపడిన కానిస్టేబుల్ రాసలీలలు..నడిరోడ్డుపై నగ్నంగా

September 1, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ కానిస్టేబుల్‌ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. అక్కడున్న స్థానికులు..’ఎవరైనా తప్పు చేస్తే, అలా చేయకూడదు అని చెప్పాల్సిన పోలీసులే, మహిళలను బెదిరించి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని, రాసలీలలు సాగిస్తున్నారు’ అని మండిపడుతూ, నగ్నంగా ఉన్న ఆ కానిస్టేబుల్‌ను బయటకు తీసుకొచ్చి చితకబాదారు. ఇకపై తప్పు చేస్తే, అది ఎవరైనా సరే, ఇలాగే బుద్ది చెప్పాలంటూ, ఆ కానిస్టేబుల్ గతంలో చేసిన పలు సంఘటలను వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే. .తూర్పు గోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అధికారమదంతో ఆడపిల్లలు కనిపిస్తే చాలు, వాళ్ల వెనుక పడటం, వేధించటం అతడి పని. గతంలో ఒక మహిళ భర్తను వేధించిన కేసులో ఉదయ్ భాస్కర్ పేరు మారుమోగింది. అంత జరిగినా, ఉదయ్ భాస్కర్‌కు మాత్రం బుద్ది రాలేదు. తాజాగా మరొక మహిళతో రాసలీలలు నడుపుతూ, గ్రామస్థులకు అడ్డంగా దొరికిపోయాడు.

పట్టపగలే ఒక వివాహిత ఇంట్లో దూరి, ఆమెతో సరస సల్లాపాల్లో మునిగితేలాడు. చుట్టుపక్కల ఉన్న వారు భాస్కర్.. ఇంట్లోకి వెళ్లడం చూసి, మిగతా గ్రామస్థులకు తెలియజేశారు. అప్రమత్తమైన గ్రామస్థులు..అక్కడి చేరుకొని, అందరూ కలిసి అతడిని అడ్డంగా పట్టుకున్నారు. నగ్నంగా ఉన్న అతడిని బయటకు తీసుకొచ్చి, చితకబాదారు. దాంతో ఆ కానిస్టేబుల్.. వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని, పరుగులు పెట్టాడు. అనంతరం గ్రామస్థులు కడియం పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు.. ఉదయ్ భాస్కర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అతడు పరుగులు పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.