ఏపీ కరోనా అప్‌డేట్.. కొత్తగా 7738 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ కరోనా అప్‌డేట్.. కొత్తగా 7738 కేసులు

September 20, 2020

nbcgn

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 70,455 పరీక్షలు చేయగా.. 7,738 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,514కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. మరోవైపు గడచిన 24 గంటల్లో 57 మంది కరోనాకు బలయ్యారు. మృతి చెందినవారిలో.. కృష్ణా జిల్లాలో 8 మంది,  చిత్తూరు 7, అనంతపురం 7, విశాఖపట్నం 6, ప్రకాశం 6, కర్నూలు 4, తూర్పు గోదావరి 4,  శ్రీకాకుళం 3, కడప 3, పశ్చిమగోదావరి 3, గుంటూరు 2, నెల్లూరు 2, విజయనగరం జిల్లాలో 2గా చనిపోయారు. 

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 5,349కి పెరిగింది. ఇక గడచిన 24 గంటల్లో 10,608 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 78,836 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 51,04,131 నమూనాలను పరీక్షించామని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.