AP created 679 new posts in education department
mictv telugu

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి.. కొత్తగా 679 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

September 17, 2022

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మండల విద్యాధికారి – 2 పోస్టులను సృష్టించింది. ఇప్పటికే ఆ హోదాలో మండల విద్యాధికారి ఉండగా, కొత్తగా 679 పోస్టులను సృష్టించి వాటి భర్తీకి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అకడెమిక్, నాన్ అకడెమిక్ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఈ పోస్టులను సృష్టిస్తున్నట్టు అధికారిక ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో దాదాపు 20 ఏళ్ల డిమాండ్ నెరవేరినట్టయింది.

అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ అంశం సుప్రీంకోర్టులో పెండింగులో ఉండడంతో విద్యాశాఖలో ప్రమోషన్లు నిలిచిపోయాయి. అందకని ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే నియామక ప్రక్రియను మొదలుపెట్టాలని సూచించింది. అలాగే ఇప్పటికే ఉన్న మండల విద్యాధికారి – 1 పోస్టుల్లో ఖాళీగా ఉన్న 13 పోస్టులను కూడా భర్తీ చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.