ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా.. నియోజకవర్గంలో టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా.. నియోజకవర్గంలో టెన్షన్

August 3, 2020

AP Deputy Speaker Kona Raghupathi Test Positive

ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రతి రోజూ పదివేలకు తక్కువ కాకుండా వ్యాధిబారిన పడుతున్నారు. సామాన్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు చాలా మంది వైరస్‌కు గురయ్యారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రఘుపతికి కరోనా అని తెలిసి నియోజకవర్గంలో కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. ఇటీవల ఆయనతో సన్నిహితంగా ఉన్నవారంతా స్వీయ నిర్భందంలోకి వెళ్లి టెస్టులకు సిద్ధం అవుతున్నారు. 

స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా అనుమానంతో టెస్టులు చేయించుకున్నారు. దీంతో అతనికి పాజిటివ్ అని తేలింది. వెంటనే అతని భార్యకు చేయగా నెగిటివ్ వచ్చింది. ఇద్దరూ గృహ నిర్భందంలోనే ఉంటున్నట్టు ప్రకటించారు. తమ ఆరోగ్యం విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. కార్యకర్తల బలంతో త్వరలోనే కోలుకుంటానని ధైర్యం నింపారు. కాగా నిత్యం జనంలో తిరిగే ప్రజా ప్రతినిధులు వరుసగా మహమ్మారి బారిన పడటం వారి సన్నిహితులను కలవరపెడుతోంది.