రాష్ట్రంలో 3,191 ఉద్యోగాలు.. ఈరోజే చివరి తేది - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రంలో 3,191 ఉద్యోగాలు.. ఈరోజే చివరి తేది

November 11, 2022

 

AP District Court Recruitment 2022 Apply Online for 3191 Posts

ఏపీలోని నిరుద్యోగులకు ఈరోజే చివరి అవకాశం. ఆ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న3,191 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆఖరు తేది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు, ఆయా జిల్లాల ఈ–కోర్టు వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్‌ 11 రాత్రి 11.59 లోపు ఆన్‌లైన్‌ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత పరీక్షా షెడ్యూల్‌ను తెలియజేస్తారు.

ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు రూ.400లను ఫీజుగా చెల్లించాలి. ప్రతీ పోస్టుకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. పోస్టుల ఖాళీలు: ఆఫీస్‌ సబార్డినేట్‌–1,520, జూనియర్‌ అసిస్టెంట్‌–681, ప్రాసెస్‌ సర్వర్‌–439, కాపీయిస్టు–209, టైపిస్ట్‌–170, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–158, స్టెనోగ్రాఫర్‌ (గ్రేడ్‌–3)–114, ఎగ్జామినర్‌–112, డ్రైవర్‌(ఎల్‌వీ)–20, రికార్డ్‌ అసిస్టెంట్‌–9 మొత్తం 3,432 పోస్టులు.

 

అర్హతలు: పోస్టులను బట్టి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్‌రైటింగ్‌/ స్టెనో సర్టిఫికెట్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయస్సు: 01/07/2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం: ఖాళీలను అనుసరించి రూ.20,000 నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ:800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).

ఎంపిక విధానం: పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.