ap electronic media advisor ali sensational comments on pawan kalyan
mictv telugu

మీరు ఇంకా ఎదగాలి, అప్పుడే బాగుపడతారు .. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ అలీ

November 8, 2022

ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ పంచులతో విరుచుకుపడ్డారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వ అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారని గగ్గోలు పెడుతున్న పవన్ కి చురకలు అంటించాడు. ప్రభుత్వం చేస్తోన్న దౌర్జన్యాన్ని తిప్పి కొడతామన్న జనసేన హెచ్చరికలను లైట్ తీసుకోవాలని కొట్టిపారేశాడు వైసిపి నేత, కమెడియన్ అలీ. ఏపీ సీఎం జగన్ తనకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇవ్వగానే గేర్ మార్చేసి తనలోని రాజకీయనేతని బయటికి తీసిన అలీ.. తన స్నేహిహితుడు పవన్ కళ్యాణ్ ని సైతం తప్పు పడుతూ ఒక మీడియా ఛానల్ లో షాకింగ్ కామెంట్స్ చేశాడు. వైసిపి ప్రభుత్వం అభివృద్దే ద్యేయంగా ముందుకెళ్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారన్న నమ్మకంతోనే జగన్ గారికి 151 సీట్లు ఇచ్చారు. అందులో భాగంగానే రోడ్లని అభివృద్ధి చేస్తున్నాం.

అయితే డవలప్మెంట్ జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలకి మంచి చేసే పనులు జరుగుతున్నప్పుడు కొందరు అర్థంలేని వ్యాఖ్యలు చేస్తారు. మనం ఇంకా ఎదగాలి.. మనం ఎదిగితేనే రాష్ట్రం, దేశం ఎదుగుతాయని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి తనదైన శైలిలో సెటైర్స్ వేశాడు అలీ. ఇక మనం ఎదగకుండా, అభివృద్ధిని తప్పుబడుతూ మీరు చేసేది తప్పు అని వాదిస్తే దానిలో అర్థమే లేదని పవన్, జనసేన నాయకులని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు అలీ. ఇక పవన్ కళ్యాణ్ ఆందోళన చేపడుతున్న ఇప్పటం గ్రామంలో నిబంధలకు అనుగుణంగా ప్రభుత్వం ఇళ్లను కూలుస్తోందని.. దానికి పరిహారం కూడా చెల్లిస్తోందని అలీ గుర్తుచేశారు. ఇరుకులో బతుకుతోన్న ప్రజలకు వసతి కల్పించడానికి, రాబోయే తరానికి ఎలాంటి కష్టం కలగకుండా ఇప్పటం గ్రామంలో రోడ్డును ప్రభుత్వం విస్తరిస్తోందని అలీ అన్నారు.