హైదరాబాద్‌లో ఏపీ ఫారెస్ట్ ఉన్నతాధికారి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ఏపీ ఫారెస్ట్ ఉన్నతాధికారి ఆత్మహత్య

October 1, 2020

AP Forest Officer In Hyderabad

హైదరాబాద్‌లో ఏపీ ఫారెస్ట్ ఉన్నతాధికారి వి. బి భాస్కర్ రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  నాగోల్‌లోని రాజీవ్‌ గృహకల్పలో ఉన్న తన నివాస భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. గురువారం ఉదయం ఈ విషాదం జరిగింది. అక్కడే ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి సుసైడ్‌ నోట్‌ దొరకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు నెలలుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

1987 ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ బ్యాచ్‌కి చెందిన రమణమూర్తి ప్రస్తుతం ఏపీ అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. పని ఒత్తిడి కారణంగా చనిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.