ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఊహించినట్లే పసుప్పచ్చ కండువా కప్పుకున్నారు. గురువారం భారీ అనుచర గణంతో విజయవాడలో అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని జనసేన ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కన్నా.. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను కలిసి మంతనాలు జరపడంతో పవన్ పార్టీలోకి వెళ్తారని ఊహాగానాలు వచ్చాయి.
కోరిన చోట టికెట్ ఇచ్చి గెలిపిస్తామని ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ముందుగా ఊహించనట్లే టీడీపీలో చేరారు. కన్నా రాకతో గుంటూరు జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో పొసగక పోవడంతో కన్నా ఇటీవలే రాంరాం చెప్పారు. కాగా ఏపీలో రాక్షస పాలన సాగుతోంది, జగన్ ప్రభుత్వాన్ని తప్పించడానికి ప్రజాస్వామ్య శక్తులందర్నీ కోరుతున్నానని కన్నా చెప్పారు.