AP: Good news..Arogya Bhruti orders released
mictv telugu

ఏపీ: గుడ్‌న్యూస్..ఆరోగ్య భృతి ఉత్తర్వులు విడుదల

July 23, 2022

AP: Good news..Arogya Bhruti orders released

ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో పని చేసే పారిశుధ్య కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఓహెచ్ఏ (ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు)కు సంబంధించిన ఉత్తర్వులను జగన్ సర్కార్ కాసేపటిక్రితమే జారీ చేసింది. విడుదల చేసిన ఉత్తర్వ్యులో.. రూ. 6 వేల చెల్లింపులపై ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొంది.

”ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల 15వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓహెచ్‌ఏను ప్రభుత్వం చెల్లించనుంది. అంటే పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం మొత్తం 43 వేల కార్మికులకుపైగా మేలు జరగుతుంది” అని పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా గతకొన్ని రోజులక్రితం పలు డిమాండ్లతో కూడిన ఆరోగ్య భృతిని ప్రస్తావిస్తూ, ఆరు పట్టణాలకు చెందిన పారిశుద్ధ్య, ఒప్పంద కార్మికులు సమ్మెను చేపట్టిన విషయం తెలిసిందే. మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని, వేతనాలు పెంచాలని అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ క్రమంలో జగన్‌ కార్మికులను సమస్యలను తెల్చుకుని, వాటిని పరిష్కరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేయనున్నట్లు నేడు జగన్ సర్కార్‌ తెలిపింది.