AP: Good news..free admissions in private schools
mictv telugu

ఏపీ: గుడ్‌న్యూస్..ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు షూరు

September 6, 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో ఒకటో తరగతిలోకి ఉచితంగా ప్రవేశాలు షూరు అయ్యాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌కుమార్‌ తెలిపారు. విద్యా హక్కు చట్టం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీలు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 6 శాతం సీట్లను కేటాయిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

” ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు మొదలైయ్యాయి. అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతి విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాం. ఎంపికైన విద్యార్థుల జాబితాను డీఈవోల ద్వారా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పంపించాం. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్లకు కూడా సమాచారం అందించాం. పాఠశాలల యాజమాన్యాలు కూడా ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందిస్తుంది. ఈ నెల 12లోపు ప్రవేశాలు పూర్తి చేస్తాం. ఆ తేదీలోపు చేరని వారు అడ్మిషన్లు కోల్పోతారు. విద్యార్థుల జాబితాను https://cse.ap.gov.in/DSE/లో ఉంచాం” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక, ఎంపికైన విద్యార్థుల జాబితాలో పేర్లు వచ్చినవారికి..ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌ తదితర సదుపాయాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. కావున ఎంపికైన విద్యార్థులను కచ్చితంగా ఆయా పాఠశాలల్లో చేర్పించాలని అధికారులు కోరారు.