AP: Good news..Group-1 notification release
mictv telugu

 ఏపీ: గుడ్‌న్యూస్..గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

October 1, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్తను చెప్పింది. గ్రూప్-1 కేడర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాదు, ఇదే నోటిఫికేషన్లో గ్రూప్-1 పోస్టులతోపాటు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.

”మొత్తం 92 గ్రూప్-1 పోస్టులు ఉన్నాయి. అందులో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులు 17 ఉన్నాయి. ఇక, గ్రూప్-1 పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు, ఎఎంవిఐ పోస్టులకు నవంబర్ 2 నుంచి 22 వరకు గడువు విధించాం. పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్ psc.ap.gov.in/లో చూడొచ్చు” అని ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్, అరుణ్ కుమార్ తెలిపారు.

ఇక, రాత పరీక్ష, ఇంటర్వ్యూ విషయానికొస్తే..ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్-1 సహా ఇతర అత్యున్నత కేడర్ పోస్టులకు రాత పరీక్షలతోపాటు, ఇంటర్వ్యూలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూల విధానాన్ని పునరుద్ధరించింది. ఈ అత్యున్నత పోస్టులన్నింటికీ ప్రిలిమ్స్, మెయిన్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి రెండేళ్లకు పెంచుతూ, గతంలో జారీచేసిన జీఓ 105 అమలును మరో రెండేళ్లు పొడిగిస్తూ, ఉత్తర్వులిచ్చింది. గతంలో 34ఏళ్ల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచి జీఓ 105 జారీ చేశారు. తాజా ఉత్తర్వులతో ఈ 42 ఏళ్ల గరిష్ట వయోపరిమితి 2023 సెప్టెంబర్ 30వరకు అమల్లో ఉంటుంది.