ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారులు నిరుద్యోగ యువతకు ఓ గుడ్న్యూస్ చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 27 ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, ఓ ప్రకటన విడుదల చేశారు.
విడుదల చేసిన ప్రకటనలో..”ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, అగ్రికల్చర్లో బీఎస్సీ, అగ్రికల్చర్/అగ్రికల్చరల్ ఎకనామిక్స్ విభాగాల్లో ఎంఎస్సీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 35 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా సెస్టెంబర్ 7,2022వ తేదీలోపు కింది ఈ మెయిల్ ఐడీకి తమ దరఖాస్తులను పంపించవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తాం. ఎంపికైన వారికి నెలకు రూ.19,500ల నుంచి రూ.54,000ల వరకు జీతంగా చెల్లిస్తాం. ఈ మెయిల్ ఐడీ: [email protected] అడ్రస్: RARS, Lam, Guntur” అని పేర్కొన్నారు.