విద్యార్ధులకు సమ్మర్ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్ధులకు సమ్మర్ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

April 16, 2022

 

jjjthdfgv

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మే 9 నుంచి జులై 3 వరకు సెలవులు మంజూరు చేస్తూ ఆ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం జులై 4 నుంచి ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు నిర్వహిస్తుండడంతో పరీక్షలు అన్నీ పూర్తయిన తర్వాతి రోజు నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇక ఒకటి నుంచి తొమ్మొదో తరగతి వాళ్లకు పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు జరగనున్నాయి. మే 5 నుంచి వారికి వేసవి సెలవులు ఇచ్చారు. అంతేకాక, జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని విద్యాశాఖ ఉత్తరువులిచ్చింది.