అమరావతి ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. హైదరాబబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతిని రద్దు చేసింది. గురువారంలోగా ఉద్యోగులు తాముంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసి అప్పగించాలని ఆదేశించింది.
అంతేకాక, రూంలన్నీ మంచి కండీషన్లో ఉండాలనీ, లేకుంటే ఉద్యోగులే బాధ్యత వహించాల్సి వస్తుందని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంటులో ఉన్న రూ. 800 కోట్లు మాయమవడంపై ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం ఆర్ధిక శాఖ అధికారులను కలిశారు. దానికి వారు.. ఎలా జరిగిందో తమకు తెలియదని, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు.