AP Government finally gives Posting to IPS AB Venkateswara Rao
mictv telugu

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌

June 15, 2022

AP Government finally gives Posting to IPS AB Venkateswara Rao

సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేస్‌ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో ఉన్న జీ.విజయ కుమార్‌ను హోమ్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా.. టీడీపీ ప్రభుత్వ హాయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో గత ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కోర్టుల్లో పోరాటం సాగించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీనిని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీని విషయంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ప్రభుత్వం తిరిగి సర్వీస్ లోకి తీసుకుంది. అయితే ఇన్నిరోజులుగా పోస్ట్ మాత్రం కేటాయించలేదు. గత నెల 18న ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేసింది ప్రభుత్వం. ఆ తర్వాతి రోజు నుంచే ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చిన డాక్యుమెంట్‌ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ రీ ఇన్ స్టేడ్ అవుతందని తెలిపింది.