ఆటోడ్రైవర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆటోడ్రైవర్లకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..

November 27, 2019

AP Government Giving Good News to Autodrivers ..

ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. మొదటి విడతగా ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ‘వైఎస్ఆర్ వాహన మిత్ర’ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రెండో విడత కింద ప్రభుత్వం లబ్దిదారులను ఖరారు చేసింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బుధవారం ప్రకటించారు. 

రెండో విడతలో మొత్తం 65,054 దరఖాస్తులు రాగా, అందులో 62,630 దరఖాస్తులను లబ్దిదారులుగా గుర్తించామని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 2 లక్షల 36 వేల 340 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం అందించామని ఆయన వెల్లడించారు. ఇందుకోసం రూ.230 కోట్లు విడుదల చేశామని ఆయన వివరించారు. వచ్చే ఏడాది కూడా కొత్త లబ్దిదారులు ఎంతమంది వస్తే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తామని మంత్రి పేర్నినాని చెప్పారు.