నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీ - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీ

October 21, 2022

 

నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి జగన్ సర్కార్ ఆమోదం తెలిపింది. దీపావళి కానుకగా దాదాపు 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్‌, 3,580 సివిల్‌ కానిస్టేబుల్‌, 315 సివిల్‌ ఎస్‌ఐ, 96 రిజర్వ్ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం ముద్ర వేశారు. ఈమేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి జూలైలోనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో 2019లో జరిగిన నియామకాల తర్వాత మళ్ళీ పోలీసు ఉద్యోగాల ఎంపిక జరగలేదు. రాష్ట్ర పోలీసు శాఖలో ప్రస్తుతమున్న దాదాపు 60వేలకు పైగా ఉన్న సిబ్బంది కాక వీక్లీ ఆఫ్‌ అమలు చేయాలంటే అదనంగా మరో 10,781 మంది అవసరం ఉంది. అంటే ఖాళీలతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో భాగంగా 6,511 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.