ఏపీలో పెన్షనర్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి చదరపు అడుగుల ఇంటి స్థలం ఉన్నవారు, 300 యూనిట్లు దాటి విద్యుత్ వాడేవారికి పెన్షన్ కట్ చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో వాలంటీర్లు పై నిబంధనల ప్రకారం అనర్హులను తేల్చే పనిలో పడ్డారు. అలాంటి వారి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. 15 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే పెన్షన్ ని శాశ్వతంగా రద్దు చేస్తామని నోటీసులు పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారి వివరాల జాబితా వాలంటీర్లకు చేరినట్టు సమాచారం. దీంతో పెన్షనర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలే పెన్షన్ మొత్తాన్ని రూ. 250 పెంచడానికి కేబినెట్ ఓకే చేసింది. ఇప్పుడిస్తున్న మొత్తాన్ని రూ.2500 నుంచి రూ. 2750కి పెంచగా, జనవరి 1 నుంచి పెంపు అమల్లోకి రానుంది. దీంతో ఒకవైపు పింఛను పెంచుతూనే మరోవైపు నిబంధనల పేరుతో కట్ చేస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారు.