ap government has set up a call center on issues in government hospitals
mictv telugu

ప్రభుత్వాసుపత్రుల్లో సమస్యలపై ఏపీ కీలక నిర్ణయం.. డైరెక్టుగా ప్రజల నుంచే

May 13, 2022

ap government has set up a call center on issues in government hospitals

ప్రభుత్వాసుపత్రుల్లో సేవలపై ఇటీవల కొన్ని ఫిర్యాదులు రావడం, అవి మీడియాలో హైలెట్ అవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య సేవలపై ఎలాంటి ఫిర్యాదునైనా నమోదు చేయడానికి 104 కాల్ సెంటర్ వినియోగించనుంది. ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ సౌకర్యం వారం, పది రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్లతో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం. టీ కృష్ణ బాబు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబులెన్స్ డ్రైవర్ల ప్రవర్తన, డబ్బులు అడగడం, సేవల్లో అలసత్వం, వాహనాలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాల్లో ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు పరికరాలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మందుల కొరత రాకూడదని వాటి కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.650 కోట్లను మంజూరు చేసిందన్నారు. మహాప్రస్థానం కోసం అదనపు వాహనాలు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.