AP government issued orders to establish Amaravati as a municipal corporation on Thursday
mictv telugu

అమ‌రావ‌తి ఇక మునిసిపాలిటీ.. 22 గ్రామాలతో..

September 8, 2022

ఏపీలోని అమరావతిని మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. తుళ్లూరు, మంగ‌ళ‌గిరి మండ‌లాల ప‌రిధిలోని 22 గ్రామ పంచాయతీలతో మున్సిపాలిటీ చేసేందుకు వీలుగా గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు ఆదేశాలు జారీచేయగా.. కలెక్టర్‌ గ్రామ సభలకు నోటీసులు జారీచేశారు. గ్రామ పంచాయతీల అభ్యంతరాలు తెలపాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. గతంలో అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పేరుతో గ్రామసభలు నిర్వహించగా.. 22 గ్రామాలతో కార్పొరేషన్‌ ప్రతిపాదనల్ని ప్రజలు తిరస్కరించారు. 29 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. మొత్తం 29 గ్రామాల‌తో మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాలంటూ ఆయా గ్రామాలు ఏక‌గ్రీవంగా తీర్మానాలు ఆమోదించి ప్ర‌భుత్వానికి పంపాయి. ఆ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌క్క‌న‌బెట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వం అవే 22 గ్రామాల‌తో ఇప్పుడు మునిసిపాలిటీ దిశ‌గా క‌స‌ర‌త్తు మొద‌లుపెట్ట‌డం గ‌మ‌నార్హం.