ఏపీలో టెన్త్ రిజల్ట్స్ ఇష్యూ.. టీచర్లకు నోటీసులు - Telugu News - Mic tv
mictv telugu

ఏపీలో టెన్త్ రిజల్ట్స్ ఇష్యూ.. టీచర్లకు నోటీసులు

June 14, 2022

ఇటీవల రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. అయితే మొత్తం ఆరు లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 4 లక్షల మంది మాత్రమే పాసయ్యారు. మిగిలిన రెండు లక్షల మంది ఫెయిలవడంతో ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్లకు సమగ్ర శిక్షా అభియాన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొందరు విద్యార్ధులు కనీస మార్కలు కూడా తెచ్చుకోలేకపోయారని, ఇది తమ డిపార్ట్‌మెంటు పరువు తీసిందని నోటీసులో పేర్కొంది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే మీ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ఫెయిలైన విద్యార్ధులు సప్లిమెంటరీలో పాసయితే వారిని రెగ్యులర్‌గా పాసయినట్టు గుర్తిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.