Ap Government Key Decision On Employees Retirement Age Here Is Details
mictv telugu

62 ఏండ్లకు రిటైర్మెంట్.. వారికి మాత్రమే

September 24, 2022

ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులకు జగనన్న ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇటీవల రిటైర్మెంట్‌ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం అందరికీ వర్తించదని తేల్చి చెప్పింది. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఈ అవకాశం లేదని స్పష్టం చేసింది. 62 ఏళ్లకు పెంపు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకేనని మెలిక పెట్టింది. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ పదవీ విరమణ వయసు పెంపు వర్తింపజేస్తూ ఆయా సంస్థలు ఉత్తర్వులు ఇవ్వకూడదని చెప్పింది. ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్.. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మెమో జారీ చేశారు. ఈ వ్యవహారంపై జరిగిన ఉల్లంఘనలపై నివేదిక పంపాలంటూ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 30లోగా ఆర్ధికశాఖకు నివేదికను పంపాలని కోరారు. ఈ మేరకు మెమో ఇచ్చారు.