AP government new Rule from Today: teachers register their attendance through face recognition app.
mictv telugu

స్కూళ్లలో నేటి నుంచి కొత్త విధానం.. వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

September 1, 2022

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఫేస్ రికగ్ననైజేషన్ యాప్ ద్వారా తమ హాజరును నమోదు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టి నుండే ఉపాధ్యాయులు తమ హాజరును ఫేస్ రికగ్ననైజేషన్ యాప్ ద్వారానే నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ యాప్ తో సాంకేతిక సమస్యలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి .ఈ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత రాకముందే ఇవాళ్టి నుండి ఈ యాప్ ద్వారానే హజరును నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నాయి.

అయితే, ఇవాళ్టీ నుంచి యాప్ ద్వారానే అటెండెన్స్ వేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. అటెండెన్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే ప్రసక్తే లేదంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. యాప్‌ ఆధారిత హాజరుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రేపటి నుంచి మొత్తం యాప్‌లను డౌన్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు.. మరోవైపు, వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వమే పరికరాలు కొనుగోలు చేసిచ్చినట్లుగా విద్యాశాఖకు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.. ఇక, ఈ పరిస్థితుల నేపథ్యంలో.. ఉపాధ్యాయ సంఘాలతో ఈ రోజు సాయంత్రం చర్చలు జరపున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

ఈ ఏడాది ఆగష్టు 16వ తేదీ నుండి యాప్ ఆధారిత హజరు నమోదు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అయితే ఈ యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఉదయం 9 గంటలలోపుగా ఈ యాప్ లో ఉపాధ్యాయులు తమ హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే యాప్ డౌన్ లోడ్ చేసుకొని హాజరు నమోదు చేసుకోవడానికి ప్రయత్నించిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వేచి చూసినా కూడా యాప్ లో హాజరు నమోదు కాలేదు.