టీడీపీ మహానాడుకు స్టేడియం ఇవ్వడానికి జగన్ సర్కారు నో - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీ మహానాడుకు స్టేడియం ఇవ్వడానికి జగన్ సర్కారు నో

May 16, 2022

తెలుగుదేశం పార్టీ పండుగ ‘మహానాడు’ నిర్వహణపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఒంగోలులో మహానాడు నిర్వహించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లింది. మహానాడు వేడుక కోసం ఈ నెల 27, 28 తేదీలలో ఒంగోలు మినీ స్టేడియాన్ని ఇవ్వాలని కోర‌గా.. ప్ర‌భుత్వం అందుకు నిరాక‌రించింది. స్టేడియానికి అవ‌స‌ర‌మైన ఫీజు చెల్లించ‌డంతో పాటుగా ముందుగానే సంప్ర‌దించినా కూడా … చివరి నిముషంలో అధికారులు స‌సేమిరా అన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నా.. అవసరం అయిన ఫీజులు చెల్లించినా ప్రభుత్వం స్టేడియం ఇవ్వకపోవడంపై టీడీపీ మండి పడింది.

దీనిపై సోమ‌వారం ‘మ‌హానాడు’ నిర్వహణ గురించి జ‌రిగిన‌ స‌మీక్ష‌లో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒంగోలు నగర సమీపంలోని మండవారి పాలెంలో 27,28 తేదీల్లో మహానాడు జరుగుతుందని , సమయం తక్కువగా వుండడంతో పనులు వేగవంతం చేయాలన్నారు. నూతనత్వంతో, భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్ కు టిడిపి అవసరాన్ని చాటేలా మహానాడు ఉండాలన్నారు. బుధవారం మహానాడు ప్రాంగణంలో పనులు ప్రారంభించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.