ఆలయాలకు ఆదాయ పరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

ఆలయాలకు ఆదాయ పరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం

June 21, 2022

తక్కువ ఆదాయం ఉండే హిందూ దేవాలయాలకు మేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుండి. ఆదాయ పరిమితిని గతంలో ఉన్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. తద్వారా 1254 ఆలయాలకు, రూ. 7.31 కోట్ల మేర లబ్ది కలుగనుంది. దేవాదాయ చట్టం ప్రకారం.. రూ. 2 లక్షల వార్షికాదాయం ఉన్న ఆలయాలు హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన కామన్ గుడ్ పండ్‌కు తమ నికారాదాయంలో 9 శాతం చెల్లించాలి. దేవాదాయ శాఖ నిర్వహణ నిధికి 8 శాతం, ఆడిట్ ఫీజు 1.50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు రూ. 2 లక్షల ఆదాయం ఉన్న దేవాలయాలు పైన చెప్పినవన్నీ చెల్లిస్తుండగా, హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రప్రభుత్వం పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తక్కువ ఆదాయం గల ఆలయాలకు మేలు జరగడంతో పాటు అర్చకుల జీత భత్యాలకు వెసులుబాటు కలుగుతుందని అర్చక సమాఖ్య తన ప్రకటనలో తెలిపింది.