ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. దీనికి సంబంధించి నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఇక సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినట్లయ్యింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.