ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త

March 31, 2022

 

జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాలనీల్లో కట్టే ఇళ్లను ఇంకొంచెం పెద్దగా కట్టుకోవాలనుకునే వారికి రూ. 3 లక్షల రుణం అందించనున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా లోన్లు మంజూరు చేసిన ఐఐఎఫ్ఎల్ సంస్థతో కలిసి లబ్దిదారులకు రుణ పత్రాలను మంజూరు చేశారు. జగనన్న కాలనీల్లో 350 చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.80 లక్షల రుణాన్ని అందిస్తోంది. అయితే చాలా మంది ఇంకొంచెం డబ్బులు పెట్టి ఇల్లు పెద్దదిగా కట్టుకోవాలని ఆశపడుతున్నారు. ఇందుకోసం బయట అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రూ. 3 లక్షల వరకు రుణాన్ని జాతీయ బ్యాంకుల మాదిరిగా స్వల్ప వడ్డీలకే అందిస్తోంది. దీన్ని 5, 8, 10 ఏళ్ల వ్యవధిలో ప్రతినెలా చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. దీన్ని ఈ పథకాన్ని రాష్ట్రమంతటా త్వరలో విస్తరిస్తామని మంత్రి తెలిపారు.