AP Govt cancels holiday on August 13
mictv telugu

విద్యార్ధులకు అలర్ట్.. రేపు సెలవు లేదు

August 12, 2022

ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం చేదు కబురు చెప్పింది. రేపు అనగా శనివారం పాఠశాలలకు సెలవు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా ఆగస్టు 13న రెండో శనివారం కారణంగా సెలవు ఉంటుంది. శుక్రవారం రాఖీ పండుగ, ఆదివారం, సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం వెరిసి వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయని విద్యార్ధులు సంబరపడ్డారు. కానీ, శనివారం రోజున వర్కింగ్ డేగా అన్ని పాఠశాలల యాజమాన్యాలు పరిగణించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఆ రోజు స్కూలుకు వచ్చి డ్యాన్స్, మ్యూజిక్ తరగతులు, ర్యాలీలు, పెయింటింగ్, గ్రూప్ చర్చలు, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి అప్‌లోడ్ చేయడం వంటి పనులు ఉంటాయని ఆదేశాల్లో పేర్కొంది. విద్యార్ధులు ఈ మార్పును గమనించాలని విద్యాశాఖ కోరింది. అటు తెలంగాణలో ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.