ఏపీ ఉద్యోగాల రిటైర్మెంట్ వయస్సు పెంచారంటూ వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. రిటైర్మెంట్ వయసు 62 నుంచి 65కు పెంచారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. వైరల్ అవుతున్న జీవో ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు అధికారులు. ఫేన్ న్యూస్ ను ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగుల రిటైర్మెంట్‌పై ఆర్థికశాఖ పేరుతో ఎలాంటి జీవో జారీ చేయలేదని స్పష్టం చేశారు. దీనిని వైరల్ చేసిన వారికోసం అన్వేషిస్తున్నట్టు తెలిపారు. వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. అలాగే ఈ జీవోను సర్కులేట్ చేస్తున్నవారిపై గుంటూరు డీఐజీకి ఆర్థిక శాఖ అధికారుల ఫిర్యాదు చేశారు. గతంలోనే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. అయితే మరోసారి ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 నుంచి 65 పెంచినట్లు ఫేక్ జీవోను వైరల్ చేశారు.. దీంతో ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.