AP Govt included 809 diseases under Arogya Shri
mictv telugu

ఆరోగ్యశ్రీలో 809 జబ్బులు చేర్చిన సీఎం జగన్

October 28, 2022

AP Govt included 809 diseases under Arogya Shri

ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీలో 809 జబ్బులకు చికిత్సను తీసుకొచ్చారు. దీంతో ఈ పథకం కింద మొత్తం చికిత్సల సంఖ్య 3225కి చేరాయి. శుక్రవారం ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. చికిత్సల అంశంపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజని, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా గాయపడిన ఇతర రాష్ట్రాల వారికి కూడా ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

ఉత్తమ సేవలు అందించే ఆరోగ్య మిత్రలకు సేవారత్న, సేవామిత్ర, ఆరోగ్య సేవ అవార్డులను అందేజేయాలని సూచించారు. అంతకు ముందు ఆరోగ్య శ్రీకి ఎక్కడా బకాయిలు లేకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు. 104 కాల్ సెంటర్ ద్వారా రిఫరల్ సర్వీసులను అందిస్తున్నామని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆరోగ్య శ్రీ కింద అందించే సేవల వివరాలను ఎంపానల్డ్, విలేజ్ క్లినిక్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులపై ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఎంపానల్డ్ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగిందని చెప్పారు.