ఉచిత కరోనా పరీక్షల కోసం ఏపీ సర్కార్ యాప్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఉచిత కరోనా పరీక్షల కోసం ఏపీ సర్కార్ యాప్..

July 7, 2020

AP Minister Balineni Srinivasa Reddy Esc

కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానం ఉందా.? అయితే ఏం ఇబ్బంది లేదు. పరీక్షలు చేయించుకునేందుకు ఏపీ ప్రభుత్వం మరింత సులభమైన పద్దతిని అందుబాటులోకి తెచ్చింది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలనే ఉద్దేశ్యంతో కొత్తగా మొబైల్ యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్న వారు ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకొని టెస్టులు చేయించుకునే అవకాశం కల్పించారు. 

 కొవిడ్‌-19 ఏపీ యాప్ పేరుతో ఉన్న ఈ మొబైల్ యాప్‌ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లో చేసుకోవాలి. ఆ తర్వాత  అందులో మీ వివరాలను పొందుపర్చాలి. పేరు నమోదు చేసుకోగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమీపంలోని ల్యాబ్‌లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కొవిడ్ పరీక్ష పూర్తిగా ఉచితంగా చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా జగన్ సర్కార్ ఇప్పటికే 10 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేసింది. రిపోర్టు కూడా నేరుగా సంబంధిత వ్యక్తి ఫోన్‌కు మెసేజ్ రూపంలో వచ్చేలా ఏర్పాట్లు కూడా చేశారు.