మాకు పింఛన్ ఇప్పించండి సారూ.. వృద్ధుల విన్నపం  - MicTv.in - Telugu News
mictv telugu

మాకు పింఛన్ ఇప్పించండి సారూ.. వృద్ధుల విన్నపం 

February 5, 2020

ap.....

ఏపీలో తమ పింఛన్లను అనవసరంగా రద్దు చేశారంటూ వృద్ధులు గోడు వెల్లబోసుకుంటున్నారు. గుంటూరు జిల్లా మతుకుమల్లి గ్రామంలో సుమారు 40 మంది పింఛన్లు నిలిపివేసినట్టు వారు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంతకు ముందు వరకు తమకు అందిన సాయం ఇప్పుడు రాకుండా పోయిందని చెబుతున్నారు. కనీసం ప్రభుత్వ పెద్దలు అయినా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

పింఛన్లు రావడం లేదని గ్రామ వాలంటీర్లను ఆరా తీస్తే వారు చెబుతున్న సమాధానం పొంతన లేకుండా ఉందని ఆరోపిస్తున్నారు. కొన్నిసార్లు రేషన్ కార్డు సరిగా లేదని, మరి కొన్ని సార్లు ఆధార్ లింక్ కాలేదని అంటున్నారని అంటున్నారు. రేషన్ కార్డు సరిగాలేకపోతే తమకు ఎలా రేషన్ ఇస్తున్నారని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అధికారులు మరోసారి సర్వే చేసి అర్హులకు అందజేయాలని అంటున్నారు. కాగా ఇక నుంచి ప్రతి నెలా ఇంటికే వచ్చి పింఛన్ ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త విధానంలో కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.