ఏపీ సర్కార్ ఉల్లి ఆఫర్.. రూ.25కే కిలో.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సర్కార్ ఉల్లి ఆఫర్.. రూ.25కే కిలో..

September 24, 2019

AP Govt Onion.....

ఉల్లి ఘాటు జనాలకు కంటనీరు పెట్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర సుమారు రూ.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం వుంది. ఈ క్రమంలో ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ ప్రజలకు రూ.25కే కిలో ఉల్లిని అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. కిలో రూ.30 చొప్పున మహారాష్ట్ర నుండి 300ల టన్నుల ఉల్లిని కొనుగోలు చేశామని చెప్పారు. వీటిని రైతు బజార్లలో 25 రూపాయలకే అందిస్తామని అన్నారు. 

వర్షాల కారణంగానే ఉల్లి ధరలు పెరగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొందరు దళారులు ఇదే అవకాశంగా భావించి ఉల్లిని నిలువ చేసుకుంటున్నారు. మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడింది. సరఫరా తగ్గడంతో ఉల్లిధరలు అమాంతం పెరగాయి. అయితే పెరిగిన ఉల్లి ధరలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా నష్టపోయామని.. ఈసారైన మద్దతు ధర లభించడం సంతోషంగా ఉందని అంటున్నారు.