బొజ్జ గణపయ్యకు రూ.  6 కోట్లతో బంగారు రథం - MicTv.in - Telugu News
mictv telugu

బొజ్జ గణపయ్యకు రూ.  6 కోట్లతో బంగారు రథం

August 29, 2019

kanipakam...

నీటి నుంచి స్వయాంభువుగా వెలసిన చిత్తూరు జిల్లాలోని  కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. లక్షలాది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామికి ఎన్నో మహిమలు ఉన్నాయని, కోరిన కోరిక తీరుందని భక్తుల విశ్వాసం. ప్రతీ ఏటా వినాయక చవితి నుంచి 21 రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో స్వామి వారిని ఊరేగించేందుకు బంగారు రథాన్ని తయారు చేయించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ ఏడాది కాణిపాకం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.6 కోట్ల వ్యయంతో స్వామి వారికి బంగారు రథం తయారు చేసేందుకు అనుమతించినట్టు తెలిపారు. టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో బంగారు రథాన్ని తయారు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రథానికి సంబంధించిన నమూనా పోస్టరు కూడా బయటకు వచ్చింది. కాాగా సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు