ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పేరులో స్వల్ప మార్పు చేసుకున్నారు. ఆమె అసలు పేరు ఉష శ్రీచరణ్ కాగా, రికార్డుల్లో మాత్రం ఉషశ్రీ చరణ్ అని ఉండేది. ఇప్పుడు పేరును ప్రభుత్వ రికార్డుల్లో కూడా మారుస్తూ ఉష శ్రీచరణ్గా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు గత నెల 2వ తేదీన సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాయగా, ఇప్పుడు ఆ ఉత్తర్వులతో కూడిన జీవో 65ను జారీ చేశారు. ఈ సందర్భంగా పేరు మార్చుకోవడానికి చాలా సమయం పట్టిందని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, ఉష శ్రీచరణ్ 2019లో అనంతపురంలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మలివిడత మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి వచ్చింది.