ap High Court denies stay on Chintamani drama ban
mictv telugu

చింతామణి నాటక నిషేధంపై స్టేకు హైకోర్టు నిరాకరణ

June 24, 2022

ap High Court denies stay on Chintamani drama ban

ఏపీ ప్రభుత్వం విధించిన చింతామణి నాటక నిషేధంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించలేదు. అయితే నాటకానికి సంబంధించిన ఒరిజినల్ వెర్షన్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. అంతకు ముందు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. నాటక నిషేధంతో చాలా మంది ఉపాధి కోల్పోయారనీ, నాటకాన్ని నిషేధించిన ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఆర్యవైశ్యుల మనోభావాలకు విరుద్ధంగా ఉన్న నాటకాన్ని వారి అభ్యర్ధన మేరకు ప్రభుత్వం గతంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.