AP High Court has given green signal to Amaravati Farmers' Padayatra
mictv telugu

ఏపీ.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత.. రైతులకు ఐడీ కార్డులివ్వాలని ఆదేశం

November 1, 2022

AP High Court has given green signal to Amaravati Farmers' Padayatra

ఏపీ హైకోర్టులో మంగళవారం అమరావతి రైతుల పాదయాత్రపై విచారణ జరిగింది. పాదయాత్రను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది. గతంలో విధించిన షరతులను సడలించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. యాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని, సంఘీభావం తెలిపేవారు ఎలాగైనా తెలవచ్చని పేర్కొంది. యాత్ర చేసే రైతులకు వెంటనే ఐడీ కార్డులివ్వాలని డీజీపీని ఆదేశించింది.

తమ ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని తెలిపింది. ఒకవేళ పాదయాత్రలో షరతులను ఉల్లంఘిస్తే యాత్ర రద్దు కోసం డీజీపీ తమను సంప్రదించవచ్చని తేల్చి చెప్పింది. కాగా, ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి చెందిన రైతులు శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యదేవాలయం వరకు పాదయాత్రగా వెళ్తున్న విషయం తెలిసిందే. కోనసీమ జిల్లా వరకు ఈ యాత్ర కొనసాగింది. ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాలతో తిరిగి ప్రారంభం కానుంది.