ఏపీ హైకోర్ట్ సంచలన తీర్పు.. 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ హైకోర్ట్ సంచలన తీర్పు.. 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష

March 31, 2022

fbfbf

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హైకోర్ట్ ఆదేశాలను లెక్క చేయకుండా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని అధికారులపై కన్నెర్ర చేసింది. అంతేకాకుండా ఆ ఎనిమిది మంది అధికారులకు కోర్టు ధిక్కరణ కింద రెండు వారాల జైలు శిక్షతోపాటు జరిమానాను విధించింది. ఎందుకు ఆ అధికారులపై ఏపీ హైకోర్ట్ అంతగా మండిపడింది అంటే.. పాఠశాల ఆవరణలో ఎటువంటి ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఐఏఎస్ అధికారులు.. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, విజయ్ కుమార్, జె. శ్యామలరావు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయకులకు హైకోర్టు శిక్ష విధించింది.

అయితే, గురువారం హైకోర్టులో ఆ ఎనిమిది మంది అధికారులు క్షమాపణలు కోరారు. దాంతో హైకోర్ట్ వారికి జైలు శిక్ష నుంచి విముక్తిని కలిగించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని, ఒకరోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని హైకోర్టు ఆదేశించింది.