వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించి..ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందించే పనిని ఒప్పజెప్పింది. ఇందుకు కోసం రూ.5 వేలు జీతాన్ని కూడా అందిస్తోంది. దీంతో గ్రామ, పట్టణాల్లో వాలంటీర్లు కీలకంగా మారారు. సంక్షేమ పథకాలు పొందాలంటే కచ్చితంగా వాలంటీర్స వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్దిదారుల ఎంపికలో వాలంటర్లీదే పైచేయి అవుతుంది. దీంతో వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసలుతో పాటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
తాజగా ఏపీ వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసంది. లబ్దిదారుల గుర్తింపులో వాలంటీర్లకు ఏం అధికారం ఉందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ అధికారులు ఉండగా.. వాలంటీర్లు ఆ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని చీవాట్లు పెట్టింది. సంక్షేమ పథకాల అర్హుల ఎంపికను వాలంటీర్లకు అప్పగించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. యాప్ లలో ప్రజల సమాచారాన్ని పొందుపర్చడం గోప్యతకు భంగం కలిగించినట్లు కాదా .. అని సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో వాలంటీర్ల నియామకానికి తాము వ్యతిరేకం కాదని తెలిపింది హైకోర్టు. చట్టం అనుమతిస్తే వారిని శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని సూచించింది.
రాజకీయ కారణాలతో లబ్దిదారుల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన 26 మంది గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై తాజాగా మంగళవారం మరోసారి విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలను చేసింది.