AP: If that happens..my responsibility: Botsa Satyanarayana
mictv telugu

ఏపీ: అలా జరిగితే..నాదీ బాధ్యత: బొత్స సత్యనారాయణ

July 16, 2022

ఆంధ్రప్రదేశ్‌‌లో గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు ప్రభుత్వ పాఠశాలలను జగన్ సర్కార్ మూసివేశారు అని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వార్తలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు క్లారిటి ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ చిన్న మారుమూల ప్రాంతంలో కూడా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలేదని, ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

పాఠశాలల మూసివేతపై ఆయన కాసేపటిక్రితమే మీడియాతో మాట్లాడారు.” ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలను ఎక్కడ మూసివేయలేదు. ఎక్కడైనా అలా జరిగింది అంటే ఆ బాధ్యత నాదీ. రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా నేను ఆ బాధ్యతను తీసుకుంటాను. 3, 4, 5 తరగతుల విలీనం తర్వాత ఫౌండేషన్ స్కూల్స్ తీసుకొస్తాం. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొనే జీవో 117కు సవరణ చేశాం. అలాగే, విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరో ఎన్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తాం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే ప్రధాన ఉపాధ్యాయుడిని కూడా నియామకం చేపట్టనున్నాం. నదులు, వాగులు, రహదారుల సమస్యలున్న పాఠశాలలపై సమీక్షిస్తున్నాం. విదేశీ విద్యకు జగనన్న పేరులో తప్పేంముంది. అయినా, మరోసారి పరిశీలిస్తాం” అని ఆయన అన్నారు.