ఏపీ.. ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ.. ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

May 31, 2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయని సోమవారం ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అంటే జూలై 1వ తేదీ నుంచే ఇంటర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా విడుదల చేశారు. క్యాలెండర్ ప్రకారం.. ‘మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పని దినాలు ఉండగా, 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొన్నారు. 2023 ఏప్రిల్‌ 21వ తేదీతో విద్యా సంవత్సరం ముగియనున్నట్లు తెలిపారు. ఆ మరుసటి రోజు నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు.’

ఇక, ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే.. ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు తేల్చి చెప్పారు. అడ్మిషన్ల కోసం ప్రకటనలు ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయరాదని హెచ్చిరించారు. కావున కాలేజీల యాజమాన్యాలు ఈ విషయాలను గుర్తుపెట్టుకోని, ఆడ్మిషన్ల విషయంలో ఏలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు.