ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడూ పరీక్షలకు ముందు జరిగే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌ను ఈ సారి పరీక్షలు తర్వాత నిర్వహించాలని నిర్ణయించింది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలు కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏప్రిల్ రెండో వారం తర్వాత ప్రాక్టికల్స్ ను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు.. అనంతరం ఏప్రిల్ 30 నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్స్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రతీ రోజు రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ ను నిర్వహించనున్నారు. ఇటీవల ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.. మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్..మార్చి 16వ తేది నంచి సెకండియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3న ముగియనుండగా.. సెకండియర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 4న ముగుస్తాయి.