ఏపీలో ఇంటర్ పరీక్షలకు హాజరై ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్ధులకు బోర్డు స్పష్టతనిచ్చింది. పరీక్షా పత్రాల వాల్యూయేషన్ జరుగుతుందని, ఈ నెల 25 తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది. ఫలితాలు విడుదల చేసిన తర్వాత డిజిటల్ స్కోర్ కార్డులు ఇస్తామని వెల్లడించింది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రభుత్వం స్కాలర్ షిప్ ఇస్తోంది. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. పాసవ్వాలంటే ప్రతీ సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది.