AP inter board released inter exams schedule
mictv telugu

ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

December 26, 2022

AP inter board released inter exams schedule

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ ని సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనుండగా, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండియర్ పరీక్షలు ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 22న, ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 24న ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయంగా నిర్ధారించారు. సెకండియర్ విద్యార్ధులకు ప్రాక్టికల్స్ ఏప్రిల్ 15 నుంచి మే 10 వరకు రెండు సెషన్స్ లో ఉంటాయి.