ఏపీ ఇంటర్ పరీక్షలు వాయిదా.. కొత్త షెడ్యూల్​ ఇదిగో - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ఇంటర్ పరీక్షలు వాయిదా.. కొత్త షెడ్యూల్​ ఇదిగో

March 3, 2022

12

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్న నేపథ్యంలో గురువారం ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పాత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉన్న పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహిస్తామని.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌ను మాత్రం ముందు ప్రకటించిన తేదీల్లోనే (మార్చి 11 నుంచి 31 వరకు) నిర్వహిస్తామని చెప్పారు.

12