AP is number one in CBI cases
mictv telugu

సీబీఐ కేసుల్లో ఏపీ నెంబర్ వన్.. పార్లమెంటులో కేంద్రం వెల్లడి

December 7, 2022

AP is number one in CBI cases

దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై సీబీఐ నమోదు చేసిన కేసుల సంఖ్య వెల్లడైంది. బుధవారం కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పార్లమెంటులో ఈ మేరకు వివరాలను తెలియజేశారు. 2017 – 2022 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 56 కేసులు నమోదయ్యాయని మొదటి స్థానంలో ఏపీ ఉందన్నారు.

ఏపీలో అత్యధికంగా 10 కేసులు ఉండగా, తర్వాత స్థానంలో ఉత్తర ప్రదేశ్, కేరళలు చెరో 6 కేసులతో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లలో 5, తమిళనాడు 4, మణిపూర్, ఢిల్లీ, బీహార్ 3, జమ్ము కశ్మీర్, కర్ణాటక 2 కేసులు, హర్యానా, చత్తీస్ ఘడ్, మేఘాలయ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లక్షద్వీప్ లలో ఒక కేసు చొప్పున నమోదైనట్టు వివరించారు. వీటిలో 22 కేసుల్లో చార్జిషీటు నమోదు చేశారని తెలిపారు. 2017లో ఆయా కేసుల్లో దోషులుగా తేల్చిన వారి శాతం 66.90 అయితే 2021లో 67.56 శాతంగా ఉంది. 2020లో అత్యధికంగా 69.83 శాతం మంది ప్రజాప్రతినిధులు దోషులుగా నిర్ధారణ అయ్యారని మంత్రి వివరించారు.