51శాతం ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

51శాతం ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే: జగన్

March 8, 2022

14

‘ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే’ అని సీఎం జగన్ అన్నారు. మంగళవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ ఏర్పాటు చేశారు. సభకు హాజరైన జగన్.. మొదటగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. ”దేశంలోనే ఇంత మంది మహిళా ప్రజాప్రతినిధులు మరెక్కడా లేరు. సభలో స్టేజి మీద, స్టేడియం నిండా, నా చుట్టూ ఉన్న మహిళలంతా ప్రజాప్రతినిధులే. రెండున్నరేళ్లుగా అధికారాన్ని అక్క, చెల్లెమ్మల కోసమే వినియోగించాం. రాజకీయ సాధికారత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది” అని జగన్ తెలిపారు

మరోపక్క టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్యే రోజా సినిమా డైలాగులతో సైటర్లు వేసిన విషయం తెలిసిందే. ”ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ అచ్చెన్నాయుడు పెద్ద జోక్ చేశారు. తిరుపతి ఎంపీ ఎన్నికల సమయంలో ‘పార్టీ లేదు. తొక్కా లేదు’ అన్న వ్యక్తి ఇప్పుడు 160 సీట్లంటూ జోక్ చేస్తున్నారన్నారు. మీడియాను మేనేజ్ చేసుకుని, తోక పార్టీలను కలుపుకొంటే సరిపోదని.. అక్కడ ఉన్నది జగన్‌ మోహన్ రెడ్డి అంటూ రోజా ఎద్దేవా చేశారు.